: కోహ్లీ కాస్త దూకుడు తగ్గించు: అజ్జూ భాయ్ సలహా


భవిష్యత్ లో టీమిండియా పగ్గాలు పూర్తిస్థాయిలో అందుకోబోయే వ్యక్తి దూకుడు తగ్గించుకోవడం చాలా అవసరమని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్.. విరాట్ కోహ్లీకి సూచించాడు. యువకుడైన కోహ్లీ తన కోపాన్ని నియంత్రించుకోవాలని, అతని ప్రవర్తన ఓ నేత మాదిరి ఉండాలని సలహా ఇచ్చాడు. ఇటీవల జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో అంపైర్ తో కోహ్లీ ఘర్షణ పడ్డాడు.

దీనిపై స్పందించిన అజ్జూ..'కోహ్లీ దూకుడు తగ్గించుకోవాలి. ప్రతిసారి అలా ప్రవర్తించడం సరికాదు. తను మంచి ఆటగాడు. భావి కెప్టెన్ గా ఎదుగుతున్న వ్యక్తి' అని పేర్కొన్నాడు. కోహ్లీ ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుందన్నాడు. అటువంటి స్వభావం మంచిదే కానీ ఎలాంటి సాయం చేయదని, అంతర్గత సంఘర్షణ తప్పదని చెప్పాడు. కొంచెం దురుసుతనం తగ్గించుకుంటే అది కోహ్లీకే మంచిదని అజ్జుభాయ్ వివరించాడు.

  • Loading...

More Telugu News