: భారత సైన్యానికి అమెరికా ఆర్మీ చీఫ్ ప్రశంస
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత ఆర్మీ ఎంతో ప్రభావవంతమైనదని అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రేమండ్ టీ ఒడెర్నో అన్నారు. రెండు దేశాల సైన్యాల మధ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ఇందుకు తాము సుముఖంగా ఉన్నామని చెప్పారు. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఒడెర్నో ఆర్మీ చీఫ్ సహా ఉన్నతాధికారులతో భేటీ అయి చర్చలు జరిపారు. రెండు దేశాల సైన్యాలు చాలా వృత్తి నైపుణ్యం గలవని, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాల్సింది ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.