: హైదరాబాద్ తో కూడిన తెలంగాణే..: డిప్యూటీ సీఎం ధీమా
ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సానుకూల ధోరణిలో వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్ళనాటి తెలంగాణ కల సాకారం కాబోతుందంటూ, హైదరాబాదుతో కూడిన ప్రత్యేక రాష్ట్రమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.