: ఇల్లు అలకగానే పండుగ కాదు: హరీశ్ రావు


కాంగ్రెస్ వ్యూహాల పట్ల తామిప్పటికీ అప్రమత్తంగానే ఉన్నామంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై పార్లమెంటులో బిల్లు పాస్ అయితేనే తాము సంబరాలు జరుపుకుంటామని, ఈ రోజు సాయంత్రం కేంద్రం చేసే ప్రకటనపై వేచిచూసే ధోరణి అవలంబిస్తామని తెలిపారు. ఎందుకంటే, డిసెంబర్ 9 ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆచితూచి స్పందిస్తామని, ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానిస్తే అప్పటివరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News