: వచ్చే ఏడాది భారత్ లో 'ఎఫ్ వన్ రేసు'లేనట్లే?
మొదటి రెండు సంవత్సరాలు 'ఇండియన్ గ్రాండ్ ప్రీ' రేసును ఆస్వాదించిన భారత ఎఫ్1 ప్రియులకు వచ్చే ఏడాది నిరాశే మిగలనుంది. మూడో సీజన్ ను బుద్ధ్ ఇంటర్నేషన్ సర్క్యూట్ లో నిర్వహించడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫార్ములావన్ బాస్ బెర్నీ ఎకిల్ స్టోన్ మాట్లాడుతూ.. 2014లో భారత్ లో బహుశా రేసు ఉండకపోవచ్చని చూచాయగా తెలిపారు. కారణం రాజకీయాలేనని సమాధానమిచ్చాడు.
ఏడాదికి 22 ఎఫ్1 రేసులు జరుగుతుండగా వచ్చే సంవత్సరం నుంచి రేసుల్ని 20కి పరిమితం చేయాలని రేసింగ్ జట్లు కోరుతున్నాయి. దాంతో ఆలోచనలో పడిన ఫార్ములావన్ యాజమాన్యం ఆ సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. ఈ క్రమంలో, అంత లాభసాటిగా లేని రెండు వేదికల్లో రేసులను నిర్వహించకూడదని, వాటిలో ఇండియన్ గ్రాండ్ ప్రికి స్వస్తి పలకాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అసలు కారణం భారత్ లో రేసులకు సంబంధించి పన్ను రాయితీలు తక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు. కానీ, దీనిపై ఇండియన్ గ్రాండ్ ప్రి ప్రమోటర్ జేపీ గ్రూప్ ఆశాభావంతో ఉంది.