: ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతల మాట..
తెలంగాణ ప్రజల కల సాకారం అవబోతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇదే విధంగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతోందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతోందని అన్నారు. సీమాంధ్ర సోదరులు సహకరిస్తారని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని వి.హనుమంతరావు సూచించారు.