: 2014 ఎన్నికలు సమైక్యాంధ్రప్రదేశ్ లోనే: లగడపాటి
రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు చెప్పారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆఖరి నిమిషంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిందన్నారు.