: ఇదో 'భారీ' డ్రమ్‌కిట్‌


డ్రమ్‌కిట్‌ అంటే ఏదో కొంతమేర వుంటుంది. దాన్ని వాయించడానికి కొద్దిపాటి సమయం సరిపోతుంది. అయితే ఈ డ్రమ్‌కిట్‌లోని అన్ని వాయిద్యాలను ఒక్కసారి పలికించాలంటే మాత్రం గంట సమయం పడుతుంది. ఎందుకంటే, ఇది అంత పెద్ద డ్రమ్‌కిట్‌ మరి. ఇలా దీన్ని మోగించేందుకు పట్టే సమయం మాత్రమే కాదు. దీని బరువుకూడా ఎక్కువేనట.

అమెరికాకు చెందిన రెవరెండ్‌ మార్క్‌ టెంపరేటో తనకున్న ఆసక్తితో ఒక పెద్ద భారీ డ్రమ్‌కిట్‌ తయారు చేశాడు. ఎంతో కష్టపడి తయారుచేసుకున్న ఈ డ్రమ్‌కిట్‌లో డప్పులు, గంటలు ఇలా ఒకటేమిటి పలు రకాలైన మోతలు మోగించవచ్చట. ఎన్నిరకాలంటే సుమారుగా 813 రకాలైన పరికరాలు ఈ కిట్‌లో ఇమిడివున్నాయట. అయితే ఈ కిట్‌ ప్రత్యేకత ఏమంటే దీన్ని నిలబడైనా, కూర్చునైనా ఒక్కచోటునే ఉండి ఈ కిట్‌లోని అన్ని పరికరాలను పలికించవచ్చట. అయితే ఇందులోని అన్ని పరికరాలను ఒకసారి తట్టడానికి కనీసం ఓ గంట సమయం పడుతుందట. గతంలో 450కి పైగా అదనపు భాగాలతో ప్రపంచంలోనే అతిపెద్ద డ్రమ్‌కిట్‌గా ఒకటి గిన్నీస్‌ రికార్డుల్లో ఉండేది. దీన్ని మార్క్‌ చక్కగా చెరిపేసి తన పేరును గిన్నీస్‌ ఖాతాలో వేసేశాడు. మార్క్‌ డ్రమ్‌కిట్‌ను గిన్నిస్‌ రికార్డ్స్‌ అధికారులు కూడా అభినందిస్తున్నారట. అన్నట్టు ఇన్ని పరికరాలున్న ఈ డ్రమ్‌కిట్‌ బరువెంతో తెలుసా... 2,268 కేజీలు!

  • Loading...

More Telugu News