: 5,946 పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలు
రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 31న మూడోదశ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం కమిషనర్ నవీన్ మిట్టల్ నేడు హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడో విడతలో 5,946 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కారణాలతో ఏడు పంచాయతీల్లో ఆగస్టు 13న పోలింగు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక రెండో విడత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 87.32 శాతం పోలింగు నమోదైందని తెలిపారు. ఖమ్మంలో అత్యధికంగా 92.08 శాతం, కరీంనగర్ లో అత్యల్పంగా 77. 86 శాతం పోలింగు నమోదైందని మిట్టల్ చెప్పారు. రాష్ట్రంలో నోటిఫికేషన్ లో విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా రూ.20.5 కోట్లు జప్తు చేసినట్లు వెల్లడించారు.