: రాష్ట్రానికి పారామిలటరీ బలగాలు
రాష్ట్రానికి కేంద్రం అదనంగా వెయ్యి పారామిలటరీ దళాలను పంపుతోంది. తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు తలెత్తినా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ ఈ బలగాలను పంపనుంది. ఇప్పటికే 1200 పారామిలటరీ దళాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దళాలను కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోహరించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోహరించిన భద్రతా బలగాలను ఉపసంహరించుకోకుండా ఇంకా అక్కడే కొనసాగిస్తుండడం విశేషం.