: బెట్టింగ్ లో గురునాథ్ పాత్రపై ఆధారాలున్నాయి: ముంబయి పోలీసులు


ఐపీఎల్-6 సందర్బంగా దేశాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ అంశంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పాత్ర ఉందని కచ్చితంగా చెబుతున్నారు ముంబయి పోలీసులు. ఫిక్సింగ్ కుంభకోణంపై బీసీసీఐ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలో శ్రీనివాసన్, గురునాథ్ లకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై ముంబయి పోలీసులు స్పందించారు. రిపోర్టు అంతా తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. కొన్ని పత్రాలను తమతో పంచుకోవాలంటూ రాసిన లేఖకు భారత్ క్రికెట్ బోర్డు ఇంతవరకు స్పందించనేలేదని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంటున్నారు. గురునాథ్ కు బెట్టింగ్ తో సంబంధం ఉన్నట్టు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News