: వాయిదాపడిన 'సడక్ బంద్'
తెలంగాణ జిల్లాల్లో భారీగా తలపెట్టిన రోడ్డు దిగ్భందన కార్యక్రమం 'సడక్ బంద్' ను తెలంగాణ రాజకీయ జేఏసీ వాయిదా వేసింది. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటన కారణంగా బంద్ ను వాయిదా వేసినట్లు జేఏసీ ప్రతినిధులు చెప్పారు. కాగా, బంద్ ను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని జేఏసీ తెలిపింది.