: తెలంగాణకు జై కొడుతున్న ఎన్సీపీ


తెలంగాణకు అనుకూలమే అని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ తారీఖ్ అన్వర్ నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు ఎన్సీపీ మద్దతిస్తోందని వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పట్ల తాము మొదటినుంచి సానుకూలంగానే స్పందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చిన్నరాష్ట్రాల డిమాండ్ ఉన్నా తెలంగాణ అంశం ఎన్నో ఏళ్ళుగా నలుగుతోందని అన్వర్ అభిప్రాయపడ్డారు. రేపు యూపీఏ పక్షాలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అవనున్న నేపథ్యంలో ఎన్సీపీ సుస్పష్ట వైఖరి వెల్లడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News