: దానం, ముఖేశ్ గౌడ్ రహస్య మంతనాలు


తెలంగాణ అంశం ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ నేడు హైదరాబాదులో రహస్యంగా మంతనాలు జరిపారు. అధిష్ఠానానికి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వినిపించేందుకు వీరు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే, ఎదురయ్యే పరిణామాలే వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ మంత్రులు భేటీ మధ్యలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీతోనూ సంప్రదింపులు సాగించారు. ఆయన అభిప్రాయాన్ని కోరగా, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాదును ప్రకటిస్తే తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఒవైసీ అభిప్రాయం ఇదేనంటూ వార్తా చానళ్ళలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News