: మయన్మార్ నుంచి చైనాకు గ్యాస్ పైప్ లైన్
మయన్మార్ నుంచి చైనాకు సహజవాయువును సరఫరా చేసే పైప్ లైన్ ను చైనా ప్రారంభించింది. బంగాళాఖాతం నుంచి చైనా పశ్చిమ ప్రాంతంలోని యునాన్ ను కలిపే 793 కిలోమీటర్ల ఈ పైప్ లైన్ ద్వారా 12 బిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ప్రతి ఏటా మయన్మార్ నుంచి సరఫరా కానుంది. కాగా, మయన్మార్ లో మైనింగ్, ఎనర్జీ రంగాల్లో చైనా పెట్టుబడులు అక్కడి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. చైనా తమ దేశ ఆర్ధిక, వాణిజ్య రంగాల్లోకి చొచ్చుకురావడం పట్ల భవిష్యత్తులో ఏ ఉపద్రవం రానుందోనంటూ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.