: ఇదో రకమైన దొంగతనం
64 కళల్లో చోరకళనూ చేర్చి దానికో ప్రత్యేకతను ఆపాదించారు మన పెద్దలు. ఆ సంగతేమో కానీ, దొంగలంటే కేవలం నగదు, నగలు దోచుకెళ్లడమే కాకుండా, మరిన్ని రకాల దొంగతనాలు కూడా వున్నాయని రుజువుచేశారీ మెటల్ దొంగలు. గ్రేటర్ నోయిడాలోని ఉద్యోగ కేంద్ర ఫ్యాక్టరీ ఏరియాలోని ఆడి ఫ్యాషన్ ఫ్యాక్టరీలో 6 టన్నుల మెటల్ ను పాతిక మంది దొంగలు దోచుకెళ్లారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు దొంగల్ని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు.