: అంధులకు తోడుండే 'మొబైల్‌'!


మనకు కళ్లుండి కొన్ని కొన్నిసార్లు ఎదురుగా ఉండే వస్తువులను ఏమరుపాటుగా గుర్తించలేము. అయితే కళ్లులేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది... ఇలా కళ్లు లేనివారికి అండగా ఉండేందుకు ఒక మొబైల్‌ లాంటి పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరం గుడ్డివారికి ఎదురుగా ఉండే వస్తువులను గురించి చక్కగా తెలియజేస్తుందట.

కర్టిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక మొబైల్‌ లాంటి పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం గుడ్డివారికి చక్కగా వారి చుట్టుపక్కల ఉండే వస్తువులను గురించి తెలుసుకునేలా చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు కలిగిన ఈ పరికరం ఎదురుగాను, చుట్టుపక్కల ఉన్న వస్తువుల వివరాలను గురించి గుడ్డివారికి చక్కగా వినిపిస్తుందట. ఇప్పటి వరకూ గుడ్డివారికి సంబంధించి అందుబాటులో ఉన్న ఇతర పరికరాలతో పోల్చితే ఈ పరికరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఈ పరికరం తయారుచేసిన బృందానికి నేతృత్వం వహించిన ఇయాన్‌ ముర్రే చెబుతున్నారు.

  • Loading...

More Telugu News