: నన్ను డాక్టర్లు చంపేయమన్నారు: స్టీఫెన్ హాకింగ్


ప్రముఖ భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను డాక్టర్లు చంపేయమన్నారని, తన భార్య వారి మాట వినకపోవడంతో తాను బతికి బట్టకట్టానని ఆయనే స్వయంగా తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనే పుస్తకం రాస్తున్నప్పడు అంటే 1985 లో ఆయన గుండె ఇన్ఫెక్షన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై స్విట్జర్లాండ్ లోని ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఆయనను బ్రతికించడానికి లైఫ్ సపోర్ట్ మెషీన్ అమర్చారట, ఆ దశలో ఆయన శరీర అవయవాలు సరిగా స్పందించకపోవడంతో డాక్టర్లు ఆ మిషన్ ఆఫ్ చేయాలని తన మొదటి భార్య(జేన్)కు సూచించారట కానీ, జేన్ వారి మాట వినలేదు సరికదా అతనిని కేంబ్రడ్జి తీసుకెళ్లిపోవడానికి పట్టుబట్టారు.

అప్పట్నుంచి వెనుదిరిగి చూడకుండా విలువైన తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పలు పరిశోధనలు చేస్తూ నిరంతరం బిజీగా ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, అపార జ్ఞాని అయిన స్టీఫెన్ హాకింగ్స్ కుర్చీకే పరిమితమై 50 ఏళ్లు బ్రతికారు. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ డాక్యుమెంటరీని వెలుగులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఆయన నరాల సంబంధవ్యాధితో బాధపడుతూ కుర్చీకి పరిమితమైపోయారు.

  • Loading...

More Telugu News