: విద్యార్ధి అనుమానాస్పద మృతి... తల్లిదండ్రుల ఆందోళన
విజయవాడలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న భార్గవ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. భార్గవ్ మృతికి కలుషితాహారమే కారణమని వార్తలు వ్యాప్తి చెందడంతో ఆ హాస్టల్ లో భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రతకు ఎవరు భరోసా ఇస్తారని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వసతులు సరిగా లేవని ప్రశ్నించిన విద్యార్ధులపై కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.