: తెలంగాణను కాంగ్రెస్ కాకుంటే మేమిస్తాం: రాజ్ నాథ్ సింగ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయిన ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం వెంటనే తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకుంటే అధికారంలోకి రాగానే తాము ప్రకటిస్తామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.