: 183 పరుగులకే జింబాబ్వేను కట్టడిచేసిన టీమిండియా


టీమిండియా బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్ మెన్ ను నిప్పులు చెరిగే బంతులతో కట్టడి చేశారు. తొలి రెండు మ్యాచ్ లలో పెద్దగా ప్రభావం చూపని బౌలర్లు మూడో వన్డేలో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు. కెప్టన్ కోహ్లీ తప్ప బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు పరుగుల ఎకానమీతో ఆకట్టుకున్నారు. అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 183 పరుగులకే 46 ఓవర్లలో జింబాబ్వే వెనుదిరిగింది. ఓపెనర్లు విఫలమైనా టాపార్డర్ విలియమ్స్(45), మసకద్జ(38), టేలర్(23) రాణించగా చివర్లో చాతారా(23) ఆకట్టుకోవడంతో జింబాబ్వే 183 పరుగులు చేయగలిగింది. ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన కోహ్లీ జింబాబ్వేను తక్కవ స్కోరుకే పెవిలియన్ బాట పట్టించడంలో సఫలమయ్యాడు. భారత బౌలర్లలో మిశ్రా(4), షమీ(2) రాణించగా వారికి వినయ్ కుమార్, ఉనద్కత్, జడేజా చక్కని సహకారమందించారు.

  • Loading...

More Telugu News