: ఆజాద్ నుంచి తెలుగు మీడియాకు ఆహ్వానం
కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్చార్జి ఆజాద్ నివాసం నుంచి తెలుగు మీడియా ప్రతినిధులకు పిలుపొచ్చింది. తెలంగాణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని భావించిన తెలుగు ప్రతినిథులు హుటాహుటిన పయనమయ్యారు. మరి కాసేపట్లో వివరాలు తెలిసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నాయకులు ఆజాద్ నివాసంలో ఉండడంతో అందర్లోనూ ఉత్కంఠ రేగుతోంది. అయితే, ఆజాద్ ఏం చెబుతారోనని మీడియా ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని ఇరు ప్రాంత నేతల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చర్చలు ముగియడంతో కాంగ్రెస్ నిర్ణయమే మిగిలిఉంది. దాంతో ఆజాద్ పిలుపు ప్రత్యేకతను సంతరించుకుంది.