: పార్లమెంట్ వీధిలో యువకుల వీరంగం.. పోలీసుల కాల్పులు


పార్లమెంట్ వీధిలో శనివారం అర్ధరాత్రి కలకలం రేగింది. కొంతమంది యువకుల మూక బైకులపై వచ్చి పార్లమెంటు వీధిలో విన్యాసాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడారు. పోలీసులు వారిపై కాల్పులు జరపగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మరణించాడు. పార్లమెంట్ వీధి అత్యంత భద్రతతో కూడిన ప్రాంతం. సుమారు 35 మంది యువకులు ఇక్కడ బైకులపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో విన్యాసాలకు పాల్పడడమే కాకుండా, రాళ్లదాడికి పాల్పడ్డారంటే ఎంతకు తెగించారో అర్థమవుతోంది. అయితే యువకులపై కాల్పులు జరపాలన్నది తమ ఉద్దేశం కాదని, బైకుల టైర్లపై కాల్పులు జరపగా యువకులకు అవి తగిలాయని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News