: లైట్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలోకి మారుతి
దేశంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకి ఇండియా సంస్థ కొత్తగా లైట్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న రెండేళ్లలో ఈ విభాగంలో తొలి వాహనాన్ని విడుదల చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. కాగా మారుతి సంస్థ 1982 వ సంవత్సరంలోనే ఈ రంగంలోకి రావాలనుకుందని అప్పట్లో వీటికి అంతగా మార్కెట్ లేదని భావించిన మారుతి సంస్థ ఆ ప్రయత్నాన్ని విరమించిందని ఈ సంస్థ చైర్మన్ ఆర్ సీ భార్గవ ఢిల్లీలో తెలిపారు. గత కొంత కాలంగా ఎల్ సీవీలకు డిమాండ్ పెరగడంతో ఆ దిశగా అడుగులు వేయాలని బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు.