: ధోనీకి ఊరట


టీమిండియా కెప్టెన్ ధోనీకి ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఓ మేగజీన్ కు సంబంధించిన ముఖచిత్రంపై ధోనీ ఫోటో(దేవుడి రూపంలో షూ పట్టుకున్న ధోని)పై పలు సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. కొందరు భక్తులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కోర్టుకెక్కారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దీనిపై విచారణ చేసిన పోలీసులు అది ధోనీ ఫోటో కాదని 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అని పేర్కొన్నారు. అసలు ధోనీకి దేవుడిని కానీ, మతాన్ని కానీ అవమానించాలనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News