: వ్యక్తిగత సిబ్బందికి క్లాసు పీకిన సల్మాన్ ఖాన్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కోపం నషాళానికంటుతోంది. తాను ఏ చిన్న పని చేసినా, ఆ సమాచారం వెంటనే పబ్లిక్ లోకి వచ్చేస్తుండడంతో తెగ చిరాకు పడిపోతున్నాడట. పూటుగా తాగి కారునడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో మీడియా చీల్చి చెండాడుతుండడంతో ప్రసారమాధ్యమాలకు తన విషయాలు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయినప్పటికీ తన గర్ల్ ఫ్రెండ్ లులియా వాంచూర్ ఎక్కడుంది? తనను ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తోంది? వంటి విషయాలు మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో తన విషయాలు బయటకి ఎలా పొక్కుతున్నాయని వ్యక్తిగత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనకు సంబంధించిన వ్యక్తిగత, వృత్తి పరమైన అంశాలేవీ బయటకు తెలియడానికి వీల్లేదని తన సిబ్బందికి గట్టి క్లాసు పీకాడట. దీంతో 'మెంటల్' షూటింగ్ తరువాతి షెడ్యూల్ ఎక్కడ అనే విషయాన్ని కూడా వారు బయటకి చెప్పడం లేదట. మొత్తానికి సల్మాన్ బాగానే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News