: నాలోని రన్నర్ సికింద్రాబాద్ లోనే పుట్టాడు: మిల్కా సింగ్


ఫ్లయింగ్ సిఖ్ గా విఖ్యాతి చెందిన పరుగులవీరుడు మిల్కా సింగ్ మనరాష్ట్రంలోనే కొన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడన్న విషయం చాలా కొద్దిమందికే తెలిసివుంటుంది. తాజాగా, భాగ్ మిల్కా భాగ్ చిత్రంతో ఈ సర్దార్జీ మళ్ళీ వార్తల్లో వ్యక్తయ్యాడు. దీంతో, ఆయనకు సంబంధించిన విషయాలపై ఆసక్తి కలగడం సహజం. ఈ నేపథ్యంలో మిల్కా భాయ్ సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ మిలిటరీ రెజిమెంట్ లో సోల్జర్ గా విధులు నిర్వర్తించారన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంగతులు ఆయనే చెప్పారు. డెక్కన్ క్రానికల్ పత్రిక ప్రతినిధితో ముచ్చటిస్తూ, పలు విషయాలు వెల్లడించాడు.

సికింద్రాబాదులో ఉన్నప్పుడు తొలిసారిగా 10 కిలోమీటర్ల పరుగులో విజయం సాధించడంతో అందరి దృష్టిలో పడ్డానని, అప్పుడే మిలిటరీ కోచ్ గురుదేవ్ సింగ్ తనకు 400 మీ. పరుగుకు అనుగుణంగా తర్ఫీదునిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. అక్కణ్ణించి తనకు ఎదురేలేకుండా పోయిందని వివరించాడు. అందుకే, సికింద్రాబాదే తనలోని రన్నర్ కు పుట్టినిల్లుగా గుర్తుంచుకుంటానని ఈ పంజాబ్ యోధుడు చెప్పుకొచ్చాడు. ఇక సెలవురోజుల్లో సైకిల్ పై చార్మినార్ వద్దకు వెళ్ళి బిర్యానీ తిన్న విషయాన్ని పంచుకుని సంతోషపడ్డాడు.

  • Loading...

More Telugu News