: సల్మాన్-షారుక్ ఆలింగనానికి అమీర్ హ్యాపీ


కొంతకాలం నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఒక్క ఆలింగనంతో ఒక్కటైపోవడం పట్ల మరో ఖాన్ హీరో అమీర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య స్నేహం బంధం తెగిపోయినప్పుడు వారిద్దరూ కౌగిలించుకుంటే అది చాలా మంచి పరిణామమని అన్నాడు. ఆ సంఘటన తనను చాలా ఆనందపరిచిందని చెప్పాడు. రెండు రోజుల కిందట ఓ బాలీవుడ్ చిత్రం ప్రీమియర్ షోకు హాజరైన అమీర్ ఖాన్ ఆ సందర్భంగా తన స్పందన తెలియజేశాడు.

ఈ నెల 21న ముంబయిలో ఓ రాజకీయ నేత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సల్మాన్, షారుక్ హాజరయ్యారు. అప్పుడే వచ్చిన కండలవీరుడు సల్లూను, ఆ రాజకీయ నేత అప్పటికే అక్కడున్న బాద్ షా వద్దకు తీసుకొచ్చాడు. వెంటనే షారుక్ సల్లూను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపాడు. దాంతో, వీరిద్దరి మధ్య ఉన్న వివాదాలకు తెరపడినట్లేనని బాలీవుడ్ స్టార్లు, అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News