: స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో తగ్గిన ఆపిల్ జోరు


మూడు నాలుగేళ్ల కిందటి వరకూ స్మార్ట్ ఫోన్ అంటే ఆపిలే. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. శాంసంగ్, నోకియా, ఎల్జీ, లెనోవో ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. దీంతో ఆపిల్ ఫోన్ల మార్కెట్ క్రమంగా తగ్గిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో ఆపిల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ వాటా నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 13 శాతానికి పడిపోయింది. ఏడాది క్రితం వాటా 16.6 శాతంగా ఉందని ఏబీఐ రీసెర్చ్ తెలిపింది. ఈ మూడు నెలల కాలంలో ఆపిల్ 3.12 కోట్ల ఐఫోన్లను విక్రయించింది. లెనోవో, ఎల్జీ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ వాటా పెరిగిందని ఏబీసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News