: పాకిస్తాన్ లో బాంబు దాడులు.. 57 మంది మృతి


ఉత్తర పాకిస్థాన్ లో అర్ధరాత్రి జరిగిన బాంబు దాడుల్లో 57 మంది మరణించారు. పరాచినార్ లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ లో 'షితీ మైనారిటీ ముస్లిం తెగ' ప్రజలను లక్ష్యం చేసుకుని జరిగిన ఈ బాంబు దాడిలో 150 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రంజాన్ సందర్భంగా మార్కెట్ లో సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన తమ వారిపై దాడి జరగడంతో కొందరు మరణించగా, మిగతావారు గాయపడ్డారని షితీ నేత షబ్బిర్ హుస్సేన్ తెలిపాడు. అయితే, దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయక పోవడంతో సున్నీ ముస్లింకు చెందిన మిలిటెంట్ గ్రూపు ఈ దాడులకు పాల్పడి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News