: విభజిస్తే తీవ్ర నష్టమే: ఎమ్మెల్యే గాదె


రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కాబట్టి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన బంద్ లో గాదె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు ధర్నాను విరమించి శాంతి సందేశంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీనికి గాదె మద్దతు పలికారు. పట్టణంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు.

  • Loading...

More Telugu News