: భారత్-పాక్-బంగ్లాదేశ్ మళ్లీ ఏకమవ్వాలి: కట్జూ


వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మరోసారి నోటికి పని చెప్పారు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మళ్లీ కలిసిపోవాలని, ఒకే దేశంగా ఏర్పడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో 'లౌకికవాదాన్ని ప్రచారం చేయడంలో మీడియా పాత్ర' అనే అంశంపై కట్జూ మాట్లాడారు. హిందూ జాతీయవాది, ముస్లిం జాతీయవాది, సిక్కు జాతీయవాది.. ఇలా కాకుండా మనందరం భారత జాతీయులుగానే ఉండాలన్నారు. భారతదేశం భిన్న మతాలతో కలసి ఉన్నదని, లౌకికవాదం లేకుండా ఒక్కరోజు కూడా మనలేదని చెప్పారు. తాను హిందూ జాతీయ వాదినని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటికి ప్రతిగానే కట్జూ పై విధంగా మాట్లాడారు. 'అసలు దీనిని దేశంగా నేను భావించడం లేదు. హిందువులు, ముస్లింలను వేరు చేయడానికి బ్రిటిషర్లు చేసిన పనే ఇది. కనుక భారత్, పాక్, బంగ్లాదేశ్ తిరిగి కలిసిపోయి ఒకే సెక్యులర్ దేశంగా ఏర్పడాలి' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News