: ఓటేసేందుకు వచ్చి కాటికెళ్ళారు!
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేసేందుకు వచ్చిన నలుగురు ప్రాణాలు విడిచిన ఘటనలు పలు జిల్లాల్లో అందర్నీ కలచివేశాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వయ్యూరులో ఓ వృద్ధురాలు మరణించగా.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంగల్ పాడులో ఓ వృద్ధుడు కన్నుమూశాడు. ఇదే జిల్లాలో నేలకొండపల్లి మండలం బొగ్గులబండలో మరో వృద్ధురాలు హఠాన్మరణం చెందింది. ఇక నల్గొండ జిల్లాలో కోదాడ మండలం గుదిగొండలో హృద్రోగంతో బాధపడుతున్న ఓ యువతి కూడా ఓటేసేందుకని వచ్చి నేలకొరిగింది. ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు.