: మెదడులోకి ఇంప్లాంట్స్‌: మూర్ఛ రోగానికి చెక్‌!


మూర్ఛ రోగం చాలా ప్రమాదకరమైనది... చాలా సందర్భాల్లో అది ప్రాణాంతకమైనది కూడా. నిజానికి మూర్ఛరోగం వలన మనిషి అచేతనంగా కాసేపు స్తంభించిపోవడం తప్ప వచ్చే ప్రమాదం లేదు. అయితే, స్తంభించిపోవడం అనేది.. ఏ వాహనం నడుపుతున్న సమయంలో సంభవించింది అనుకోండి.. అప్పుడు తనకే కాదు.. ఇతరుల ప్రాణాలకు కూడా పెనుప్రమాదం తప్పదు.

అయితే మెదడులో కొన్ని ఇంప్లాంట్స్‌ను ఉంచడం ద్వారా.. మూర్ఛరోగం ప్రభావం లేకుండా చేయడం సాధ్యం అవుతుందని.. శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.. మూర్ఛకు హేతువును కనుగొనడం ద్వారా దాని విరుగుడును కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మానవ మెదడులో అడినోసిన్‌ స్థాయి తక్కువగా ఉండడమే మూర్ఛకు కారణమని గతంలో అధ్యయనాలు తేల్చాయి. అందుకే ఓరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, టఫ్ట్స్‌ యూనివర్సిటీ సైంటిస్టులు.. ఎలుకల మెదడులో అడినోసిన్‌ విడుదల చేసే ఇంప్లాంట్స్‌ అమర్చి చూశారు. దాని ప్రభావం వల్ల జన్యు మార్పుల్లో అడినోసిన్‌ ఎఫెక్ట్‌ ఉంటున్నట్టు గుర్తించారు. ఆ ప్రభావంగా మూర్ఛ రావడం లేదని వారు గుర్తించారు.

  • Loading...

More Telugu News