: మిల్లర్ హీరోయిజం.. సౌతాఫ్రికా 223/7
వికెట్లు పడుతున్నా మిల్లర్ చెలరేగి ఆడడంతో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది. పల్లెకెలే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మిల్లర్ నాలుగు సిక్స్ లు, ఐదు ఫోర్ల సాయంతో 83 పరుగులు బాదడంతో సౌతాఫ్రికా ఆమాత్రం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం 224 పరుగుల లక్ష్యసాధనతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక పది ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.