: నేడు రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపు
హైదరాబాదులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ ఈ రోజు రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చింది. నిన్న జరిగిన బాంబు పేలుళ్లను ఖండిస్తూ, ఈ బంద్ కు పిలుపు ఇస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, బందుకు అన్ని వర్గాల వారూ మద్దతు ఇచ్చి, సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.