: తెలంగాణపై వెనక్కు తగ్గితే సమ్మె చేస్తాం : టీఎన్ జీవో


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రంపై సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తుండటంపై టీఎన్ జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గితే మరోమారు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు హైదరాబాదులో సద్భావన ర్యాలీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను వ్యక్తిగతంగా కలిసి తెలంగాణకు అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News