: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒకే ఒక్క భారతీయ చిత్రం
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఒకే ఒక్క భారతీయ చిత్రం అర్హత సాధించింది. 'కుష్' పేరుతో కేవలం 20 నిమిషాలు ఉన్న ఈ చిత్రాన్ని సుభాషిస్ భుటైని రూపొందించారు. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు హత్య చేసిన ఘటన చుట్టూ చిత్ర కథ తిరుగుతుంది. ఇందిర మరణానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఓ సిక్కు విద్యార్ధిని రక్షించేందుకు ఓ స్కూల్ టీచర్ చేసే పోరాటాన్ని చూపిస్తుంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 7 వరకు పదకొండు రోజుల పాటు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అర్హత పొందిన చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు.