: సల్మాన్ కు జైలుశిక్ష పడదంటున్న అనిల్ కపూర్
కారుతో ఢీకొట్టి ఒకరి మరణానికి కారణమైన కేసులో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడకపోవచ్చని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ మీడియా ప్రశ్నలకు జవాబిచ్చారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న విషయంపై ఎక్కువగా మాట్లాడకూడదంటూనే, సల్మాన్ కు శిక్ష పడదని తన మనస్సాక్షి చెబుతోందని పేర్కొన్నాడు. కాగా, సల్మాన్ తో కలిసి అనిల్ కపూర్.. దీవానా మస్తానా, బీవీ నెం.1, నో ఎంట్రీ, సలామ్-ఎ-ఇష్క్, యువరాజ్, వాంటెడ్ చిత్రాల్లో నటించారు.