: వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలపై ఐటి దాడులు
రాష్ట్రంలోని పలు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కళాశాలల్లోని మేనేజ్ మెంట్ కోటా సీట్లను దొడ్డిదారిన అధిక ధర (రూ.45 వేల నుంచి 1.2 లక్షలు) కు అమ్ముకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే వివిధ కళాశాలల నుంచి కోట్ల రూపాయలను సీజ్ చేయగా, మరో రెండు రోజులు సోదాలు జరుగుతాయని సమాచారం. కళాశాలల్లో పనిచేస్తున్న వారే మధ్యవర్తుల ద్వారా సీట్లను అమ్ముకుంటున్నారని నిన్న ఓ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది.