: రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి జరగదు: మహీధర్ రెడ్డి
తామంతా సమైక్యాంధ్రను కోరుకుంటున్నామని రాష్ట్ర మంత్రి మహీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ ఏపీ భవన్ లోని గురజాడ హాలులో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. పలు పథకాలు నిలిచిపోతాయని వివరించారు. రాష్ట్ర విభజనకు ఎవరూ సుముఖంగా లేరని ఆయన తెలిపారు.