: ఆ అనాథలకు స్మశానమే తోడునీడ!


తల్లిదండ్రులు ఎయిడ్స్ తో చనిపోవడం ఆ చిన్నారుల పాలిట శాపమైంది. అనాథలైన ఆ పిల్లలు.. గ్రామస్థులు తరిమికొట్టడంతో దిక్కులేక, ఉండేందుకు చోటు లేక ఇప్పుడు స్మశానంలో నివసిస్తున్నారు. తాజాగా, అక్కడినుంచి కూడా పోమ్మంటుండంతో ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని దుర్భర స్థితిలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నాళ్ల నుంచి అక్కడే ఓ చెట్టు కింద పట్టలతో చిన్న ఇల్లులా వేసుకుని ఉంటున్నామని 17 ఏళ్ల బాలుడు తెలిపాడు.

రెండు సంవత్సరాల కిందట తమ తల్లిదండ్రులిద్దరూ ఎయిడ్స్ తో మృతి చెందారని, ఆ వైరస్ తమకూ అంటుకుంటుందనే భయంతో బంధువులు, గ్రామస్థులు వెళ్లగొట్టారని ఆ బాలుడు చెప్పాడు. దాంతో, స్మశానంలోనే అమ్మానాన్నల సమాధుల పక్కన ఉంటున్నామని వెల్లడించాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటున్నామని మిగతా బాలలు తెలిపారు. ఇప్పుడు స్మశానంలో ఉంటున్న వారివల్ల ఊరంతా కలుషితం అవుతుందని, అక్కడినుంచి వెళ్లగొట్టాలని గ్రామస్థులు ప్రయత్నించారు. విషయం తెలుసుకుని షాక్ గురైన బాలల హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వమే వారికి ఆశ్రయం కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News