: ఇన్ శాట్ 3డీ సక్సెస్
వాతావరణం, ప్రకృతి విపత్తుల సమాచారాన్ని తెలియజేసే ఇన్ శాట్ 3డీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి అర్ధరాత్రి 1.23గంటలకు యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్-5 రాకెట్ రోదసిలోకి తీసుకెళ్లింది. ఇన్ శాట్ 3డీ ఉపగ్రహం నుంచి హసన్ (కర్ణాటక)లోని మాస్టర్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు అందాయని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. వాతావరణానికి సంబంధించి ముందస్తు సమాచారం, విపత్తుల హెచ్చరికల విధానాన్ని ఇది మరింత మెరుగుపరుస్తుందన్నారు. ఇది ఏడేళ్ల పాటు సేవలు అందించనుందని చెప్పారు.