: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ కన్నుమూత


రాజీవ్ గాంధీ సమీప బంధువు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ(69) అనారోగ్యం కారణంగా గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్నోలో జన్మించిన అరుణ్ నెహ్రూ మూడుసార్లు లోక్ సభ సభ్యునిగా గెలుపొందారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. 1984 ఎన్నికల్లో అమితాబ్, సునీల్ దత్, మాధవరావు సింధియా తదితరులను ప్రచారంలోకి దింపాలంటూ రాజీవ్ కు సలహా ఇచ్చింది అరుణే. తర్వాత కాలంలో రాజీవ్ తో విభేదించి విపీ సింగ్ తో కలిసిపోయారు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని వారాలుగా అరుణ్ నెహ్రూ గుర్గావ్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమార్తె ప్రియాంక ఇటీవలే నెహ్రూను ఆస్పత్రిలో పరామర్శించారు. అరుణ్ నెహ్రూ అంత్యక్రియలు నేడు ఢిల్లీలో జరుగుతాయి.

  • Loading...

More Telugu News