: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్లకు పైగా లాభపడి 19,880 పైన కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22 పాయింట్లకు పైగా లాభపడి 5,935 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో సన్ ఫార్మా ఇండియా, ఎల్ అండ్ టి, జిందాల్ స్టీల్ అండ్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, కోల్ ఇండియా, మారుతి సుజుకీ, భారతి ఎయిర్ టెల్, టాటా మోటార్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News