: జైలు నుంచి భార్యకు సంజయ్ దత్ విలువైన బహుమతి


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన ప్రియమైన భార్య మాన్యత పుట్టిన రోజు (జులై 22)కు విలువైన బహుమతి పంపాడు. రెండు నెలల నుంచి ఎరవాడ జైలులో ఉంటున్న సంజూ అంతటి విలువైన గిఫ్ట్ ఏం పంపి ఉంటాడు? అని ఆలోచిస్తున్నారా. మాన్యత కోసం మొదటిసారి ఓ కవిత రాసి దాంతో పాటు ఓ గులాబీ కూడా పంపాడు. ఓరోజు జైల్లో ఓ గులాబీ కోసిన సంజయ్ దానిని పుస్తకంలో దాచాడు. తర్వాత అది పూర్తిగా ఎండిపోయింది. అయినా వాటిని తన లాయర్ ద్వారా భార్యకు పంపించాడు. ఆ బహుమతిని చూసి, కవిత రూపంలో ఉన్న తన భర్త హృదయ స్పందనను చదివిన మాన్యత కన్నీరు పెట్టుకుందని ఓ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News