: సచిన్ కు థ్యాంక్స్ చెబుతున్న రాయుడు


అరంగేట్రం మ్యాచ్ లో ఆకట్టుకున్న తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు (27) తన ప్రదర్శనకు సచిన్, రాబిన్ సింగ్ లే కారణమని చెప్పుకొచ్చాడు. అందుకే వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జింబాబ్వేతో తొలి వన్డేలో రాయుడు 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ సమయంలో సచిన్, రాబిన్ తన వెన్నుతట్టి ప్రోత్సహించారని రాయుడు వివరించాడు. రాయుడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సచిన్ ఆ జట్టులో అనుభవజ్ఞుడు కాగా, రాబిన్ సింగ్ జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునే క్రమంలో వారి సాయం మరువలేనిదని రాయుడు అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News