: పారిపోయిన బుకీలు లొంగిపోయారు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పరారీలో ఉన్న బుకీలు సంజయ్ జైపూర్, పవన్ జైపూర్ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎదుట ఈ రోజు లొంగిపోయారు. ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ కేసు వెలుగులోకి రావడంతో వీరిద్దరిపైనా ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ లను అరెస్టు చేయడంతో డొంకంతా కదిలింది. బాలీవుడ్ నటుడు విందూ సింగ్ తోపాటు జైపూర్ సోదరుల లింకు వెల్లడైంది. దాంతో, ముంబై పోలీసులు ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అప్పటినుంచి వీరు పరారీలో ఉన్నారు. వీరు దుబాయ్ పారిపోవడానికి బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ సహాయం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.

  • Loading...

More Telugu News