: ఐఫోన్ షాక్ తో ఆసుపత్రిపాలైన ఆస్ట్రేలియన్ మహిళ
ఐఫోన్ కారణంగా ఓ మహిళ షాక్ కు గురైంది. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న ఆమెకు ఐఫోన్ కరెంటు షాక్ ఇవ్వడంతో వెంటనే రాయల్ నార్త్ షోర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఫోన్ కారణంగా షాక్ తగిలిన పేషెంట్లు తమ వద్దకు చాలామంది వస్తున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ షాక్ వల్ల ముందు గుండెకు ప్రమాదమని చెబుతున్నారు. కొన్నిరోజుల కిందట ఇలానే ఐఫోన్ షాక్ తో చైనాలో ఓ మహిళ మరణించింది. ఇకనుంచి ఐఫోన్ తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.