: మిస్బా సూపర్ ఫిఫ్టీ.. సిరీస్ పాక్ వశం


విండీస్ తో వన్డే సిరీస్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. గ్రాస్ ఐలెట్ లో నిన్న జరిగిన ఐదో వన్డేలో పాకిస్తాన్ 4 వికెట్లతో ఆతిథ్య విండీస్ ను ఓడించింది. దీంతో, 3-1తో సిరీస్ లో విజేతగా నిలిచింది. ఈ సిరీస్ లో ఓ వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, చివరి వన్డే వివరాల్లోకెళితే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కరీబియన్లు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. బ్రావో (48), శామ్యూల్స్ (45), చార్లెస్ (43) రాణించారు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 3 వికెట్లు తీయగా, అజ్మల్, ఇర్ఫాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 49.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ షేజాద్ 64 పరుగులు చేయగా.. కెప్టెన్ మిస్బావుల్ హక్ (63) సమయోచిత ఇన్నింగ్స్ తో పాక్ కు సిరీస్ అందించాడు. మిస్బాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' కూడా దక్కింది. ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లాడిన మిస్బా 63.41 సగటుతో 260 పరుగులు సాధించాడు. వాటిలో 4 ఫిఫ్టీలున్నాయి.

  • Loading...

More Telugu News